ప్రతి ఒక్కరూ బాలల పరిరక్షణ కొరకు కృషి చేయాలి

 – తహసీల్దార్ మార్కల రజిని రెడ్డి
– మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణా కార్యక్రమం
నవతెలంగాణ – జమ్మికుంట
బాలల పరిరక్షణ గ్రామంలో ప్రతి ఒక్కరు బాధ్యత అని ప్రతి ఒక్కరు బాలుల పరిరక్షణ కొరకు కృషి చేస్తూ వాళ్లకి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే స్పందించి బాలలకు భరోసా గా ఉంటూ వాళ్ల సంరక్షణ కొరకు కృషి చేయాలని మండల తహసిల్దార్ మార్కల రజిని రెడ్డి అన్నారు. సోమవారం  కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సీడీపీఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయం నందుమండలబాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  తహసిల్దార్ మాట్లాడారు.  బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు, బాలల హక్కుల పరిరక్షణ , బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన , విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల పైన ముఖ్యంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త లు,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ,వివిధ గ్రామస్థాయి అధికారులు  అవగాహనా కలిగి ఉండాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ  కోసం అందరుసహకరించాలని ఆమె అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య దృష్టికి వస్తే కమిటీ దృష్టికి గాని పోలీసువారి 100 కానీ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్ కు సమాచారము ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎంపీడీవో కల్పన, సీడీపీఓ భాగ్యలక్ష్మి, ఎస్సై రాజేష్, ఎం ఈ ఓ విడపు శ్రీనివాస్, బాలల పరిరక్షణ అధికారి రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ దూడం కుమారస్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష, అనురాస్ పద్మ, ఏ పిఎం శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్యూసియా, చైల్డ్ హెల్ప్లైన్1098కేస్వర్కర్సాయికిరణ్,పూజారులు,పాస్టర్లు, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love