పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

– కష్టపడ్డ వారికి పార్టీలో తగిన గుర్తింపు
– గ్రూపు రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు
– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు
– కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ –  జమ్మికుంట
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు అన్నారు. గురువారం జమ్మికుంట మండలం  వెంకటేశ్వర్ పల్లి గ్రామ వెంకటేశ్వర గార్డెన్ లో మండల ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టపడితేనే పదవులు వస్తాయని పైరవులు చేస్తే పదవులు రావని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీగా బిజెపి పార్టీ ఉంటుందని, ఇప్పటికే ఆ పార్టీ వాళ్లు అయోధ్య అని, రాముని అక్షింతలంటూ ప్రచారం చేస్తున్నారని అని అన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బుత్ స్థాయి కమిటీ నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఉండి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించేలా ఇప్పటినుండే కార్యదీక్ష కు పోనుకొని ముందుకు కొనసాగాలని ఆయన కోరారు. పార్టీలోకి కొత్తవారు కూడా వస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని, పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల  కాంగ్రెస్  అధ్యక్షులు పుల్లురి సదానందంకాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరుకాల వీరేశలింగం ,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడేపు సారంగపాణి , మొలుగురి సదయ్య , రాచపల్లి రమేష్ , పర్లపెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love