Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

ఎంపీపీఓ క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

జాబ్ కార్డున్న ప్రతి కూలి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ సూచించారు. శనివారం తాడిచెర్ల, మల్లారం సర్పంచ్లు బండి స్వామి, మేకల రాజయ్య,ఏపిఓ హరీష్ లతో కలిసి పని ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిష్ బ్రీడింగ్, వాటర్ హర్విస్టింగ్ పనులను పరిశీలించారు. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్కరోజుకు కూలీకి రూ.307 చొప్పున,100 రోజుల కు రూ.30,700 పొందవచ్చని తెలిపారు. మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పని ప్రదేశం లో కూలీలకు మంచి నీళ్లు, నీడ కోసం చలువ పందిళ్ళు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మల్లిఖార్జునరెడ్డి, చెలుకల రాజు యాదవ్, ఉపాది సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -