నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా సర్పంచ్ కె రవికిరణ్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు పదో తరగతి లో 521 మార్కులు సాధించిన కొత్త పేట ప్రవళిక, బి సునీత రాణి 507, అంతేకాకుండా ఘన్పూర్ పాఠశాలలో 521 మార్కులు సాధించడం ఇదే మొదటిసారన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సెకండ్ ర్యాంక్ రావడం చాలా గొప్ప విషయమాన్నారు.మొదటి,రేండవ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు 5000/ రూపాయలు ఆగస్టు 15 కు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యా యులు ఆనంద్ మాట్లాడుతు విద్యార్థులు కస్టపడి చదవారని, సిబ్బంది కష్టపడ్డారని, అందుకే ఈరోజు గర్వంగా చెప్పుకుటున్నామన్నారు. నావంతుగా 1మొదటి, 2 రేండవ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు 3500 ఇస్తానని హామీ ఇచ్చారు. సాయినాథ్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయివేట్ పాఠశాల కు దిటుగా మార్కులు సాధించడం ఆనందంగ ఉందన్నారు.అంతకు ముందు విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ ఎం గంగామణి, విడిసి సభ్యులు అర్ సాయిలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


