రూరల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ..

నవతెలంగాణ- మోపాల్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ టికెట్ ఆశావాహులకు ఆదివారం రోజున నిరాశ ఎదురయింది. దాదాపు 50 మందికి పైబడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ జాబితా ప్రకటించింది. అందులో బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాల్కొండ తదితరులకు టికెట్లు ప్రకటించడం జరిగింది. కానీ నిజామాబాద్ రూరల్ వచ్చేసరికి ఇంకా టికెట్ ని ఎవరికీ కేటాయించలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గ స్థానాల కంటే రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ రేపుతుంది. దాదాపు ఇప్పటికే ముగ్గు ఆశావాహులు బరిలో ఉన్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, గత రెండు రోజుల నుండి మరొక పేరు తెరపైకి వస్తుంది మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వస్తుంది. దాదాపు ఆరు నెలల నుంచి భూపతిరెడ్డి, నగేష్ రెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని వేడుకుంటున్నారు అలాగే ప్రచార రతాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఎవరికి వారి టికెట్ నాకే వస్తుంది  అని దిమా వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు విషయానికొస్తే ఇప్పటికే దాదాపు తల కోటి రూపాయల పైబడి ఖర్చుపెట్టినట్టు కార్యకర్తలకు గుసగుస ఆడుతున్నారు. ఎలక్షన్ దాదాపు 50 రోజులు కూడా లేదని ఇప్పటికీ తమ ప్రాంతానికి టికెట్ కేటాయించకపోవడంతో కింది స్థాయి కార్యకర్తలు నిరాశకు గురిఆవుతున్నారు. మిగతా పార్టీలు తమ అభ్యర్థి ఎవరో తెలిసి ప్రచారానికి సిద్ధంగా ఉంటే తమ అభ్యర్థి ఎవరో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయకేతనo ఎగరవేసిన తర్వాత కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పెరిగిపోయింది. మరో రెండు రోజుల్లో రాహుల్ గాంధీ పర్యటన,  రోడ్ షో ఉండడంతో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా మ్మ కు కానుకగా ఇద్దామని ఎదురుచూస్తున్నారు కానీ ఎవరు తమ ఎమ్మెల్యే అభ్యర్థి తెలియక దిక్కుతోచని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థిలో కూడా టికెట్టు ఎవరికొస్తుందో అని రోజు రోజుకి వారి గుండెల్లో గుబులు పరిగెడుతున్నాయి. అధిష్టానం చుట్టూ రాయబారాలకి తమ సమయం గడిచిపోతుందని ముందే టికెట్ కన్ఫామ్ చేస్తే నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టు సాధించుకోవడానికి అలాగే కార్యకర్తలతో దిశా నిర్దేశాలు చేయడానికి తోడ్పడుతుందని వారు సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.  ముగ్గురిలో ఒకరికి టికెట్ వస్తే ఇంకా ఇద్దరు పార్టీకి కట్టుబడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తారా లేదా అలాగే టికెట్ రాని వారికి అధిష్టానం బుజ్జగించాలంటే కూడా అధిష్టానానికి తలకు మించిన భారమవుతుంది.  ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్లో వర్గ పోరు ఎక్కువగా ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి నెలకొంటుంది. జనాభా ప్రాతిపదికన తీసుకున్న కూడా పెద్ద నియోజకవర్గంగ ఉంది భౌగోళిక పరంగా కూడా ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కంటే పెద్ద నియోజకవర్గo రూరల్ నియోజకవర్గం. గత పది సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉండడం వల్ల కార్యకర్తలు నిరాశ గురై ఈసారి కచ్చితంగా రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి తమ అధికారంలోకి వస్తామని ఆశాభావం ఉంది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణ తెచ్చింది మేము అనే నినాదంతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలు ప్రజల్లోకి మూకుముడిగా తీసుకెళ్తామని ఆశాభావం కూడా ఉంది వారిలో. పది సంవత్సరాలు పాలించిన బారాస పైన కూడా కొంత వ్యతిరేకత ఉందని ముఖ్యంగా మోపాల మండల కేంద్రంలో మంచిప్ప ప్రాజెక్టు విషయంలో కానీ, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నందున ప్రత్యామ్నాయం వైపే ప్రజలు వేచి చూస్తున్నారని. మండల కాంగ్రెస్ లీడర్లు పదేపదే చెబుతున్నారు. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గం ఎక్కువ ట్రైబల్ ఓటర్ల పై ఆధారపడి ఉంటుంది. గత ఎన్నికల్లో బారాసా అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ గెలుపును కూడా తాండ ఓట్ల కీలకంగా మారాయని వాటిపైనే దృష్టి ఎక్కువగా పెడుతున్నారని దాని మూలంగానే బంజారా భవన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వారు చెప్తున్నారు. అలాగే ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగిలిన అభ్యర్థులు సమిష్టిగా పనిచేస్తే ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా నీ ఎగురవేయచ్చని అంతర్గతంగా కాంగ్రెస్ కార్యకర్తలు మదన పడుతున్నారు. అంతే కాకుండా కచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో.  ఎక్కడ చూసిన రోడ్ల పరిస్థితి బాగోలేదని కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లో బాగు చేస్తామని వారు ఇంటింటి ప్రచారంలో చెబుతున్నారు.

Spread the love