కార్మికుల శ్రమ దోపిడీ

– పని ప్రదేశాల్లో అవస్థలు..
– ప్రమాదపు అంచుల్లో జీవనం
– నెలలో 27 రోజులు పనిచేస్తే పూర్తి వేతనం
– మానవత్వం మరిచిన పెట్టుబడిదారులు
– 12 గంటల పనిదినం అమలు చేస్తున్న యజమాన్యాలు
– పారిశ్రామిక వాడల్లో కార్మికులు గోస వర్ణణతీతం
పేదరికాన్నీ ఆసరాగా చేసుకుని కంపెనీల యజమాన్యాలు మా శ్రమను దోచుకుంటు న్నాయి. రాత్రికి, పగలుకు తేడా లేకుండా పనిచేసిన గంటకు రూ.20 వేతనమే. నెలలో ఒక రోజు తప్పిన వచ్చే అత్తేసరు వేతనంలో కోతలు. ఇదేందని అడిగితే మారుసటి రోజు ఉద్యోగం ఊడుతుంది. బయట ఉపాధి లేక పూటగడుపు కోవడానికి కంపెనీల యజమా న్యాలు పెట్టే ఇబ్బందులకు గుండె రాయి చేసుకుని బతుకుతున్నాం. మా గోస ఎవరికి చెప్పలో తెలియదు.. మా కష్టాలకు పరిష్కా రం దొరుకుందన్న ఆశలు లేకుండ మా జీవితాలు కంపెనీల యజమాన్యాల చేతుల్లో నలిగిపోతున్నాయి. పొట్టకూటికి వచ్చిన వాళ్లం..కడుపు మాడ్చుకుని పస్తులుండాల్సి వస్తోంది. బతుకుదెరువు కోసం వలస వచ్చి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కార్మికులపై కథనం.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వివిధ పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కార్మికులు కార్మిక శాఖ లెక్కల ప్రకారం లక్ష మంది ఉన్నారు. ప్రభుత్వం గుర్తించని వారు మరో 50వేల వరకు ఉన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 80 శాతం అంతరాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు ఉన్నారు. ఓరిసా, బీహర్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి బతుకుదెరువు కోసం పొట్టచేత బట్టుకుని వచ్చిన వలస కార్మికుల పేదరికాన్నీ ఆసరగా చేస్తుకున్న యజమాన్యాలు ‘కుక్కకు బొక్క వేసిన’ చందంగా రోజుకు 12 గంటల పాటు మొద్దు కష్టం చేయించుకుని రోజు వారి వేతనం రూ.250 చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. చేసిన పనికి ఎప్పుడు డబ్బులు వస్తాయే కూడా తెలియని పరిస్థితిలో.. పొట్టపో సుకోవడానికి వచ్చిన కార్మికులకు కడుపు మాడ్చు కోవడం తప్పడం లేదు.
జిల్లాలోని మహేశ్వరం ప్రాంతంలో రెసల్యూషన్‌ కపెంనీ థర్మకోల్‌, ఎలక్ట్రానీక్‌ టీవీల స్పేర్‌ పాట్స్‌ తయారీ కంపెనీల్లో లోడింగ్‌.. అన్‌ లోడింగ్‌ హమాలీ పనిలో కుదిరాడు. రెండు నె లలుగా రాత్రి, పగలు లేడా లేకుండా.. రోజులకు 12 గంటల నుంచి 14 వరకు పనిచేయిం చుకుంటున్న యజమాన్యం రోజు రూ. 300 వేతనం ఇస్తామని ఒప్పంద చేసుకుంది. కానీ రెండు నెలలు రూపాయి వేతనం ఇవ్వకపోవడంతో కార్మికు డు రోజుకు ఒక పూట బోజనంతో సరిపెట్టు కుంటూ కాలం గడుపుతున్నాడు. పని విడిసి ఇంటి కి పోదామంటే తొవ ఖర్చులకు కూడ డబ్బులు లేని.. పరిస్థితి ఇంటి నుంచి డబ్బుల కోసం కబు రు.. తనకు ఇద్దరు పిల్లలు భార్య. కుట్టుమిషన్‌తో భార్య పిల్లలను సాకుతుంది. ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బులు ఇంటికి పంపిస్తానని ఆశతో వచ్చిన షణు ముఖ్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని.. ఇన్ని కావు. తల దాచుకోవడానికి గూడు లేదు.. కడుపు నింపు కోవడానికి తిండి లేక నానా అవస్తలతో కాలం వెళ్లదీస్తున్నాడు..
‘ఉత్తరప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన సుదియ ఆరేండ్ల కింద భర్తతో పాటు ఉపాధి కోసం తెలం గాణకు వచ్చింది. వాటర్‌ ట్యాంక్‌ తయారీ కంపె నీలో భార్య, భర్తలు పనిచేస్తున్నారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే ఇద్దరికి వచ్చే వేతనం రూ. 600 ఈ లెక్కన నెలకు రూ. 18 వేలు ఆదా యం వస్తోదనుకుంటే పొరపాటే.. ఆదివారాలు, సెలవు దినాలు జీతం కట్టు.. ఆరోగ్యం బాగోలేక ఒక రోజు సెలవు పెట్టిన అదనంగా ఒక రోజు వేతనం కోత అన్ని పోను వారికి వచ్చేది నెలకు రూ. 15 వేలు.. ప్రాంతంగానికి ప్రాంతానికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకున్న ఫలితం లేదని.. కనీ సం మూడు పుట తిండికి కూడా డబ్బులు సరిపో వడం లేవు. ఇక ఇంటికి ఏమీ పంపాలి’ అని ఆ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని కంపెనీల యజమాన్యాలు కార్మికులను శ్రమను దోచుకుంటున్నారు. వెట్టి చాకీరి చేయించుకుని చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. కార్మికులను నిర్భందాలకు గురి చేసి యజమాన్యాలు వారి రక్తపీ డ్చుకు తింటున్నాయి. కార్మికులపై ఇంటి దౌర్జన్యా లకు పాల్పడుతున్న కార్మిక శాఖ అధికారులు, ప్ర భుత్వం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు చేసింది. ఈ ప్రాంతంలోని కార్మికుల సమస్యల పరిష్కారంకై పోరాటాలు చేపాడతాం.
– చంద్రమోహన్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి.

Spread the love