బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

mandous-cycloneనవతెలంగాణ – హైదరాబాద్
పశ్చిమకేంద్ర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్రపీడనంగా మారిందని, బుధవారం ఉదయంలోగా వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ సాయంత్రం మీడియాకు చెప్పారు. వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ విపత్తు ప్రభావం 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఉంటుందని, రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కడలి కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదన్న హెచ్చరికలు కొనసాగిస్తున్నామన్నారు.

Spread the love