ఫెసిలిటేషన్ కేంద్రాల గడువు రెండు రోజులు పొడిగింపు: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఫెసిలిటేషన్ కేంద్రాల గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ లో పాల్గొనే వారికి  ఆయా నియజక వర్గాల పరిధిలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఈ నెల 3 నుండి 8 వరకు ఏర్పాటు చేయడం జరిగిందని అట్టి కేంద్రాలను మరో రెండు రోజులు అనగా నేడు , రేపటి వరకు పొడిగించినట్లు తెలిపారు.ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు,సిబ్బంది, పోలీసులు ఇంకా పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకొని వారు సత్వరమే వినియోగించుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో  తెలిపారు.
Spread the love