Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలి

ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
రాజోలి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో వారి సమస్యల పైన మాట్లాడుతున్నటువంటి కెవిపిఎస్ నాయకులు రాజోలి మండల కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు లేవని మండుటెండల్లోనే పనిచేస్తున్నారని పనిచేయడానికి పారా గంప గడ్డపార అలాంటివి వస్తువులు ఇవ్వడం లేదని అలాగే ఎండకు టెంట్ కూడా సౌకర్యం కల్పించలేదని అన్నారు. ఉదయం 6 గంటలకు పనిచేయడానికి వస్తున్నాము పనికి ముందు ఫోటో దిగడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కొంతమంది ఉపాధి హామీ కూలీలకు కళ్ళు రెప్పలు పడకపోవడంతో చాలామంది ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారని, పనికి తగ్గ డబ్బులు రావడం లేదనిఅలాగే ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి ఉప్పరి వెంకటన్న పనిచేస్తూ మూర్చ వ్యాధి కింద పడిపోవడం జరిగింది.

మరియు ఉప్పరి ఎంకమ్మ అనే మహిళకు పాము కరిచింది వీరిద్దరిని హాస్పిటల్కు చికిత్స కొరకు తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి వీళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయము అందడం లేదు. ఇట్టి విషయం చాలా బాధాకరమని నాయకులు అన్నారు. ఎక్కడైతే పని ప్రదేశంలో హాని జరిగితే ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. అలాగే జాబ్ కార్డు మీద కాకుండా ఒక మనిషికి 100 రోజుల పని కల్పించాలని కొలతలు లేకుండా బిల్లులు చెల్లించాలని ఉపాధి కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఏ పరంజ్యోతి కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కె రమేష్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ విజయకుమార్ అన్నారు. అనంతరం రాజోలి లో ఉపాధి హామీ కమిటీ వేయడం జరిగింది. మరియు తూర్పు గార్లపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి అక్కడ కూడా గ్రామ కమిటీ వేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -