Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజలమండలిలో 
ఉద్యోగాలంటూ ఫేక్‌ ప్రచారం

జలమండలిలో 
ఉద్యోగాలంటూ ఫేక్‌ ప్రచారం

- Advertisement -


సోషల్‌ మీడియా పోస్టర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉద్యోగ నియామకాలుంటే అధికారిక ప్రకటనలు విడుదల చేస్తామని వెల్లడి
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ‘‘హైదరాబాద్‌ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ 2026’’ పేరుతో ఒక పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. ఆ పోస్టర్‌లో జలమండలిలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు, వేతనాలు, అర్హతల వివరాలు పేర్కొంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన జలమండలి అధికారులు ప్రస్తుతం పోస్టర్‌లో పేర్కొన్న విధంగా ఎలాంటి నియామక ప్రక్రియనూ జలమండలి చేపట్టలేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. జలమండలిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వచ్చిన సందర్భంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లేదా సంబంధిత అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నియామకాలుంటామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ప్రభుత్వ, జలమండలి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేస్తారని చెప్పారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నిర్ధారణ లేని పోస్టర్లు, వార్తలు, తప్పుడు ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు నమ్మొద్దని జలమండలి అధికారులు సూచించారు. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ, జలమండలి అధికారిక ప్రకటనలను అనుసరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -