పరిగి సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

– ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన
– పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
– ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ చేయించాలని డిమాండ్‌
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోని సబ్‌ స్టేషన్‌ ఎదుట పలు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కాలిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ను రిపేర్‌ చేయ కుండా జ్యాప్యం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైదరాబాద్‌- బీజాపూర్‌ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ట్రాక్టర్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహిం చారు. విద్యుత్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాన్స్‌ ఫార్మర్‌రిపేర్‌ చేయమంటే పండగ పేరు చెప్పి తమను సబ్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటున్నారని, విద్యుత్‌ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ చేసి ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. రైతుల నిరసనతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పోలీసులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసన విరమించారు.

Spread the love