నవతెలంగాణ-ఆలేరు టౌను
లో వెంటేజీ విద్యుత్ సమస్యతో రైతులకు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ ఆలేరు పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతును విద్యుత్ సమస్య వేధిస్తోందన్నారు. తెలంగాణలో వర్షాభావం, విద్యుత్ సమస్యలు అన్నదాతలను తీవ్రంగా వేధిస్తున్నాయని, ఎల్-నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోవైపు కరెంటు కోతలు, లో-వోల్టేజ్ సమస్యల వల్ల బోరుబావులు నడవడం కష్టమై పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
ఈ సంక్షోభం రైతులను తీవ్ర నష్టాల ఊబిలోకి నెడుతోందని, లో వోల్టేజ్ ప్రాబ్లం అసలే వర్షాలు లేక సతమతమవుతున్న రైతులకి, మధ్యలో ఈ కరెంటు కోతల వల్ల తమ పంట పొలాలు ఎండిపోవడానికి కారణం అవుతున్నాయని అన్నారు. సాధారణ వర్షపాతం 40 శాతం వరకు లోటు నమోదవుతోందని,సరైన తేమ లేక విత్తనాలు మొలకెత్తక, వరి వంటి ప్రధాన పంటల నారుమళ్లు ఎండిపోతున్నాయని చెప్పారు. లో-వోల్టేజ్ మరియు అప్రకటిత విద్యుత్ కోతలు రైతులకు పెద్ద తలనొప్పిగా మారాయి.
లో-వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతుల కోసం రైతులు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, వర్షాలు లేకపోవడంతో రైతులు పూర్తిగా బోరుబావుల పైనే ఆధారపడ్డారని, విద్యుత్ లో వోల్టేజీ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోందని, విద్యుత్ వినియోగం పెరగడంతో పలు మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడంలేదు. పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ ఎక్కడా అమలు కావడంలేదని, 9 గంటల విద్యుత్‌ను కుదించి, 6 నుంచి 7 గంటలు మాత్రమే ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారని, షెడ్యూల్ ప్రకారం కాకుండా విడతల వారీగా ఇస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదని, విద్యుత్ కోతలు, విద్యుత్ లో వోల్టేజీ తో పంటలు పూర్తి స్థాయిలో తడవడంలేదని అన్నారు. పంట కీలక దశలో “లో వోల్టేజీ” సమస్యతో కళ్లముందే ఎండుతున్న పంటలు ఓ వైపు, కాలిపోతున్న మోటార్లకి
వేలకు వేలు పోసి మరమ్మతు చేయించాలో, లేక పంటకు పెట్టుబడులే పెట్టాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పారు. సాధారణంగా 350 నుంచి 400వోల్టులు రావాల్సిన విద్యుత్ 200 నుంచి 250కి పడిపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో పాడైన మోటార్లను బయటకు తీయడం వాటి స్థానంలో కొత్తవి లేదా, మారమ్మ పులుచే పార్టీ బిగించడం ఇబ్బందిగా మారిందన్నారు.



