- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ‘రైతు భరోసా’ నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ఆయన తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. రైతు భరోసా పంపిణీ చేసి ప్రభుత్వం పట్ల రైతుల్లో విశ్వాసం పెంచుతున్నామని ఆయన వెల్లడించారు.
- Advertisement -



