Friday, July 3, 2026
E-PAPER
Homeజాతీయంకర్నాటకలోని ఓ క్వారీలో ఘోరప్రమాదం

కర్నాటకలోని ఓ క్వారీలో ఘోరప్రమాదం

- Advertisement -

ఎనిమిది మంది కూలీలు మృతి
బెంగళూరు : కర్నా టకలోని బెంగళూరు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్ష‍ిణ తాలూకాలోని మాద పట్టణ సమీపంలోని ఓ రాతి క్వారీలో భారీ బండరాయి దొర్లి పడడంతో బీహార్‌కు చెందిన ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్ప త్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాద పట్టణ సమీపంలోని ఓ రాతి క్వారీలో రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు ఎప్పటిలాగే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి ఓ బండరాయి ఒక్కసారిగా కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో బండరాయి కింద నలిగిపోయి ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది గాయపడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని హుటాహుటిన సమీపంలోని ప్రయి వేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ 18 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నట్టు తెలిసింది. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు.మరోపక్క విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

క్వారీ ఘటనపై స్పందించిన కర్నాటక ముఖ్యమంత్రి
క్వారీలో ప్రమాద ఘటనపై కర్నా టక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘బెంగళూరు దక్షిణ తాలూకాలోని మాద పట్టణంలో బండరాయి పడి ఎనిమిది మంది కూలీలు మరణించడం విచారకరం. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. కార్మికుల ప్రాణ రక్షణ, భద్రతను కల్పించడం క్వారీ యజమానుల బాధ్యత. నిబంధనలను ఉల్లంఘించే క్వారీలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -