తండ్రి అయిన టీం ఇండియా సీనియర్ పేస్ బౌలర్

నవతెలంగాణ – హైదరాబాద్:  టీం ఇండియా సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ఆడబిడ్డకి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అనుష్క శర్మతో పాటు పలువురు ఇషాంత్ కి శుభాకాంక్షలు తెలిపారు. 2016 డిసెంబర్ 10న బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమ సింగ్ ని ఇషాంత్ వివాహం చేసుకున్నారు. భారత జట్టు తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు ఆడారు.  ఐపిఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Spread the love