నవతెలంగాణ- లక్నో: లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో ఇవాళ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయగా.. సౌతాఫ్రికా గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్.. అలెక్స్ క్యారీ స్థానంలో జోస్ ఇంగ్లిస్ తుది జట్టులోకి వచ్చారు. సౌతాఫ్రికా టీమ్‌లో గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు ..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి