నవతెలంగాణ- హైదరాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించాడు. చారిత్రాత్మక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ షానన్ గాబ్రియేల్ ఓవర్లో బౌండరీ కొట్టి సెంచరీ చేశాడు. 197 బంతుల్లో 11 ఫోర్లతో కింగ్ కోహ్లీ (118)శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడు మూడంకెల స్కోర్ చేయడం ఇది 29వసారి. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ సహచర అటగాడు రవింద్ర జడేజా 117బంతుల్లో (53) కూడా అర్ధ సెంచరీతో గ్రీస్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్..336/4.