
కొత్తగా పోడు సాగు నివారించాలి…
– ఎఫ్.డి.ఒ దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట అడవుల అభివృద్ధికి చేపట్టి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎఫ్.డి.ఒ దామోదర్ రెడ్డి సిబ్బందికి సూచించారు. అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని,విధులు పట్ల నిర్లక్ష్యం పని చేయదని అన్నారు.
స్థానిక రెంజ్ కార్యాలయంలో మంగళవారం ఆయన అడవుల పునరుద్ధరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన పనులు,ఈ ఏడాది చేపట్టబోయే పనులపై సమీక్షించారు.ఇకపై పోడు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,పోడు వల్ల కలిగే అనర్థాలపై గిరిజనులకు సైతం అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.అడవుల రక్షణ చర్యలపై నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో ఎఫ్.ఆర్.ఒ కరుణాకర్ చారీ, అశ్వారావుపేట,దమ్మపేట రేంజ్ పరిధిలోని సెక్షన్, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.