మల్యాల బీట్ లో విలువైన టేకు చెట్ల నరికివేత

Felling of valuable teak trees in Mallya beatనవతెలంగాణ – జన్నారం

జన్నారం అటవీ డివిజన్ పరిధి లోని తాళ్ల పేట రేంజ్ మల్యాల బీట్ లో విలువైన  టేకు, ఇతర చెట్లను నరికారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అందుకు కారకులైన ఐదుగురిపై   కేసు నమోదు చేశారు. మహ్మదాబాద్ నుంచి మల్యాల్ వెళ్లే దారిలోని విద్యుత్తు తీగల కింద ఉన్న చెట్లతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కావడంతో ఆ చెట్లను నరికివేసి నట్లు తెలిసింది. మరికొన్ని చెట్లకు గొడ్డలితో కాటు వేసి వదిలి పెట్టారు. ప్రభుత్వం పచ్చదనం కొరకు విరివిగా మొక్కలు నాటుతున్న సందర్భంలో ఇలా అటవిలో ఉన్న చెట్లను ఇష్టాను రీతిగా నరికి వేయడం పట్ల ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. చెట్లు నరుకుతుండగా  అటవీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తాళ్ల పేట   రేంజి అధికారిణి సుష్మారావును  సంప్రదించగా కొన్ని చెట్లు నరికివేతకు గురికావడంతో అయి దుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Spread the love