స్పాన్సర్‌షిప్‌తో రూ. 1 లక్ష కోట్ల ఆదాయం
జెనీవా (స్విట్జర్లాండ్) : ఫుట్‌బాల్‌ను కమర్షియల్ కమొడిటిగా మార్చివేసిన ఫిఫా.. 2026 ప్రపంచకప్‌తో ఖజానా నింపుకోవటంపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా, బెట్టింగ్ కంపెనీలతో ఫిఫా ఒప్పందాలు చేసుకుంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఫిఫాతో ఒప్పందం కుదుర్చుకున్న బెట్టింగ్ సంస్థ బెటానో ఇప్పడు మరోసారి దోస్తీకి సై అనేసింది. బెటానాతో పాటు మరో బెట్టింగ్ సంస్థతో ఫిఫా సుమారు రూ. 1 లక్ష కోట్లు (11 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఆర్జించనుందని సమాచారం.బెటానోతో ఖతార్ 2022 ప్రపంచకప్‌తోనే ఒప్పందం చేసుకున్నా, తాజా ప్రపంచకప్‌లో ఒప్పంద విలువ బయటకు రాలేదు. కానీ మరో రెండు సంస్థలతో ఒప్పందంతో ఓవరాల్ రూ. 1.05 లక్షల కోట్లు (11 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఆదాయం ఆర్జించనుందని సమాచారం. ప్రిడిక్షన్ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన అబుదాబికి చెందిన ఏడిఐ ప్రిడిక్‌స్టీట్ సైతం ఫిపాతో ఒప్పందం చేసుకుంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ ఆపరేటర్ స్టాట్స్ ఫర్‌ఫామ్‌తోనూ ఫిఫా డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం బెట్టింగ్ ఆపరేటర్ 104 ప్రపంచకప్ మ్యాచ్‌లకు లైవ్‌స్ట్రీమ్‌లో జూదానికి తెరలేపనున్నాడు. ఫిఫా ప్రపంచకప్‌తో ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్ బెట్టింగ్ హక్కులను దక్కించుకుంది.
ఫిఫా రూల్ప్ ప్రకారం ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అధికారులు బెట్టింగ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదు. కానీ, బెట్టింగ్ సంస్థలతో అధికారికంగా దోస్తీతో బెట్టింగ్ మాఫియాకు ఫిఫా తలుపులు తెరిచినట్టు అయ్యింది.
బెట్టింగ్ కంపెనీలతో ఫిఫా దోస్తీ
- Advertisement -
- Advertisement -


