Thursday, August 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వివేకానంద ఆవాసానికి జవాన్ కుటుంబం ఆర్థిక సాయం.     

వివేకానంద ఆవాసానికి జవాన్ కుటుంబం ఆర్థిక సాయం.     

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన రైతు సిలారి గంగాధర్ విజయలక్ష్మి దంపతులు గురువారం రోజు వివేకానంద ఆవాసానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గత సంవత్సరం గంగాధర్ విజయలక్ష్మి దంపతుల కుమారుడు ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ గత సంవత్సరం ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జవాన్ పుట్టినరోజు గురువారం రోజు కావడంతో జ్ఞాపకార్థం జవాన్ కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వంట సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి రూ.20 వేల నగదును అందజేశారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులకు ఆవాసం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -