మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సహాయం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామానికి చెందిన అంబాల బాబు అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం ఎంపీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి మృతుని కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ. కుటుంబానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా గృహ లక్ష్మి ఇల్లు ఆల్రెడీ సాంక్షన్ చేసినాము. అలాగే కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని. హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో… ఎంపీటీసీ వెలిశాల స్వరూప, పిఎసిఎస్ డైరెక్టర్ శ్యామల జ్యోతి సమ్మె రెడ్డి, వరదం వరదరాజు, భూక్య సుమలత, బజారు క్రాంతి, గంగేల్లి భరత్ పత్రి పూర్ణ గంగెల్లి భరత్, యాకోబు, పసుల భద్రయ్య, గడ్డం సారయ్య, పసుల సమ్మయ్య, గడ్డం ప్రవీణ్, జనగాం రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love