టోలిచౌకిలోని ఆయిల్ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం..

నవతెలంగాణ హైదరాబాద్‌: నగరంలోని టోలిచౌకిలో ఆయిల్ స్టోర్స్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. బంకు పెట్రోల్ బంకులకు సంబంధించిన స్టోరేజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురిచేసింది. మంటలను అదుపు చేయడంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు అగ్నిమాపక శాఖలు సంయుక్త సహకారంతో ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారు. ఈ ఘటనతో అయోమయానికి గురైన చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను తాత్కాలికంగా ఖాళీ చేయాలని కోరారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన నూనెలో మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది.

Spread the love