బాణసంచాలు కాల్చి, కేక్ కట్ చేసి..

– ఘనంగా రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

– గాగీల్లపూర్ లో వృద్ధులకు అన్నదానం 
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ శ్రేణులు బాణసంచాలు కాల్చి..కేక్ కట్ చేసి మాజీ ఎంపీపీ,రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఒగ్గు దామోదర్ ను మండల కాంగ్రెస్ శ్రేణులు శాలువాలు కప్పి సత్కరించారు. అంతకుముందు గాగీల్లపూర్ గ్రామంలోని అశ్రమంలో వృద్ధులకు కాంగ్రెస్ శ్రేణులు అన్నదానం నిర్వహించారు. ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు బోనగిరి రాజేందర్,నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,రొడ్డ మల్లేశం, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,జెల్లా ప్రభాకర్,మంకాల బాబు, వడ్లకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు.
Spread the love