తొలితరం దళిత కవి

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో, కుసుమ నాగమ్మ, వీరస్వామి దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు. చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. భారతరత్న డా, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలి తరం దళిత కవి కుసుమ ధర్మన్న. తెలుగు వారి తొలి సాహిత్య రాజధాని రాజమహేంద్రవరం, కార్యక్షేత్రంగా జాతీయోద్యమ కాలంలో దళితుల కోసం పొలికేక వేసిన వాడు కుసుమ ధర్మన్న కవి. 1900లో పుట్టి 17 ఏప్రిల్‌ 1945లో నడి వయసులో నే కన్ను మూసిన ధర్మన్న, జీవించిన జీవితం అటు దేశానికీ, ఇటు దళిత జాతికి అంకితం చేసిన త్యాగశీలి. సాంఘిక, సాంస్కతిక, సాహితి రంగాలలో కుసుమ ధర్మన్న వేసిన ముద్ర అనితర సాధ్యమైంది. బహుముఖినమైన ధర్మన్న ప్రతిభ ప్రధానంగా ఐదు మార్గాల్లో విస్తరించింది. వైద్యరంగం, సాహిత్య సజన,కళా రంగం, పత్రిక నిర్వహణ, వాక్తత్వం. ఈ పంచ గుణాలతో ధర్మన్న ఆనాటి ఆంధ్ర సమాజాన్ని ముఖ్యంగా దళిత జాతిని ఉత్తేజపరిచాడు. వైద్య విద్వాన్‌ పరీక్ష ఉత్తీర్ణుడు అయినా ధర్మన్న తను నేర్చి వైద్యాన్ని పేద సమాజం కన్నెత్తి చూడ నిరాకరించిన గ్రామీణులకు పేద దళితులకు అందించిన ప్రజా వైద్యుడు. ఆధునిక ప్రజా వాగ్గేయకారుడు, ధర్మన్న తొలి రోజుల్లో గాంధీ సిద్ధాంతాల వైపు చూసిన దళిత విముక్తికి అంబేద్కర్‌, శరణ్యమని నమ్మి అంబేద్కర్‌ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. జయభేరి పత్రికను స్థాపించిన తొలి దళిత పత్రిక సంపాదకుడు కుసుమ ధర్మన్న. 1925 నుండి ఆంధ్ర దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన అఖిలాంధ్ర మహాసభల్లో ధర్మన్న ఆలోచనత్మకమైన , ఉద్వేగమైన ప్రసంగాలు ఎన్నో చేశాడు. ధర్మన్న రచనలు 1, నిన్మ జాతి విముక్తి తరంగణి, (1921) 2) నిన్మ జాతుల ఉత్పత్తి, మద్యపాన నిషేధం, అంటరాని వాళ్ళ( కథలు) హరిజన శతకం వంటి రచనలు చేశాడు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, రచయితగా కుసుమ ధర్మన్న స్థానం ఆద్వితీయమైనది. దళిత పోరాట చరిత్రలోను ఆయనకు ఆయనే సాటి అందుకే వారి ఆశయాలను ఆలోచనలను, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక సేవను, సమత వాదాన్ని, నేటి తరానికి తెలియజేయాలని ఉద్దేశంతో నేటికీ తను చేసినటువంటి రచనలు, సేవలు, చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి.
– కుసుమ ధర్మన్న 125 వ జయంతి ఉత్సవ సందర్భంగా

– దేవులపల్లి రమేశ్‌, 9963701294

Spread the love