నవతెలంగాణ – తిమ్మాజిపేట
మత్స్యకారుల సహకార సంఘం నూతన కమిటీని తిమ్మాజిపేట మండల కేంద్రంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కర్రేపాప హనుమంతు ప్రధాన కార్యదర్శిగా ఎర్రం సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా చింతకాయల శివయ్య డైరెక్టర్లుగా కర్రేపాప బలమని, గడ్డల పరుశురాం, బోయిని మల్లేష్, కావలి లక్ష్మయ్య, పాసమని భరత్, సి ఉమాదేవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీని ఎలక్షన్ కమిషన్ షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు వచ్చే సబ్సిడీ పథకాలు సంఘం సభ్యులు సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
మత్స్యకారుల సహకార సంఘం ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


