Thursday, June 4, 2026
E-PAPER
Homeకరీంనగర్ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన అన్వితకు ఆర్థిక సాయం

ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన అన్వితకు ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
కడు పేదరికాన్ని జయిస్తూ పదో తరగతిలో 562 మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో తొలి జాబితాలో సీటు పొందిన భూపతిపూర్ గ్రామానికి చెందిన తాడూరి అన్వితకు ఉపాధ్యాయులు,దాతలు, గ్రామస్థులు అండగా నిలిచారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన అన్విత ఉన్నత విద్యకు సహాయంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపతిపూర్,కాంప్లెక్స్ పాఠశాలల ఉపాధ్యాయులు,దాతల సహకారంతో రూ.30,000 అందజేశారు.అదనంగా చింతలూరు విశ్వబ్రాహ్మణ సంఘం రూ.10,000, ఛత్రపతి శివాజీ యూత్ రూ.5,000, చింతలూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రూ.3,000,సర్పంచ్ బానోత్ వనిత-రమేష్ రూ.2,500,మట్ట గజం రాజేశం రూ.4,000 అందించారు. మొత్తం రూ.54,500 ఆర్థిక సాయాన్ని అన్వితకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,దాతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -