నవతెలంగాణ-ఇనుగుర్తి
ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆదివారం కుక్కలు దాడి చేసి ఐదు మేక పిల్లలను చంపేశాయి. ఇంటి వద్ద దొడ్డిలో దాచి ఉంచిన మేక పిల్లలపై కుక్కలు దాడి చేయగా అవి అక్కడికక్కడే మృతి చెందాయి. మండల కేంద్రానికి చెందిన చిన్నాల ఐలయ్య రోజు వారి వృత్తిలో భాగంగా మేకలను మేపడానికి వెళుతూ చిన్న మేక పిల్లలను ఇంటి వద్ద దొడ్డిలో దాచి వెళ్లాడు. కుక్కలు వాటిపై దాడి చేయడంతో ఐదు మేక పిల్లలు మత్యువాత పడ్డాయి. సమాచారం తెలిసిన ఐలయ్య మేక పిల్లల వద్దకు వచ్చి బోరున విలపించాడు. తమ రోజువారి బతుకుదెరువు అయినా గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి తినడంతో బోరున విలపిస్తూ మృతి చెందిన మేక పిల్లల విలువ రూ.25 వేలు ఉంటుందని బాధితుదు ఐలయ్య తెలిపారు. తమకు ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరాడు.