Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజమ్మూ కశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంచ్, రాజౌరీలలో ఆదివారం కురిసిన కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 12 మంది మరణించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

అధికారుల వివరాల ప్రకారం, పూంచ్ జిల్లాలో 9 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారు, ఒకరు గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, స్థానిక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని సురన్‌కోట్ తహసీల్‌లో నష్టం తీవ్రంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 130కి పైగా ఇళ్లు, 18 పాఠశాలలు, అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది. వందలాది ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 127 కనాల్స్ విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -