ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న ఆహారం ఎంతో ఆరోగ్యకరమైనది: కళావతి ఐసిడిఎస్ సూపర్వైజర్

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వము ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న ఆహారము ఎంతో ఆరోగ్యకరమైనది మరియు విలువైనదని సూపర్వైజర్ కళావతి అన్నారు. మంగళవారం మండలంలో పోషణ పక్షంలో భాగంగా పసర 2, మరియు గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు, మహిళలకు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. ప్రభుత్వము వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న ఆహారము ఎంతో విలువైనది ఆరోగ్యకరమైనదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆహారాన్ని తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అదే విదంగా చిరుధాన్యాలు అలవాటు చేసుకోవడం వాళ్ళ బీపీ, షుగర్ వంటి సమస్యలకి దూరంగా ఉంటాము అని తెలిపారు. మన పరిసరాలలో దొరికే ఆకుకూరలు భోజనంలో వాడమని వాటి వల్ల కలిగే ప్రయోజనల గురించి వివరంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ ఈ డబ్ల్యూ నుండి స్రవంతి, పంచాయతీ కార్యదర్శి శ్వేత, ఏఎన్ఎం సరోజన, ఆశవర్కర్ అనిత, మరియు అంగన్వాడీ టీచర్స్ తారబాయ్, రాజేశ్వరి, ఏ డబ్ల్యు హెచ్ లలిత, లీలా, మహిళలు పాలుగోన్నారు.
Spread the love