హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందు తోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడి యోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో కనిపించారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి, మెడలో పూలదండతో స్టైలిష్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఆయన కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. చిరునవ్వుతో ఆయన లుక్ ఫెస్టివల్ వైబ్‌ను తీసుకొచ్చింది. అందంగా అలంకరించిన సంప్రదాయ ఇంటి నేపథ్యంలో, రంగురంగుల పూలతోరణాలు, ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న మహిళల మధ్య రూపొందించిన ఈ పోస్టర్ సినిమా పండుగ వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేయడానికి కళ్యాణ్ రామ్ తనపేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. ‘అనిల్ రావిపూడి జోన్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సంక్రాంతి 2027కి ఒక భారీ ఎంటర్టైనర్‌కు సిద్ధంగా ఉండండి` అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇది కూడా అనిల్ రావిపూడి సినిమాల ప్రమోషన్స్‌లో ఉండే ప్రత్యేకతను మరోసారి చూపించింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా జరుగుతోంది.
మరో బ్లాక్ బస్టర్ కోసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



