Sunday, July 5, 2026
E-PAPER
Homeమానవిఫ్యాటీ లివర్…

ఫ్యాటీ లివర్…

- Advertisement -

కాలేయ సమస్యలు అంత త్వరగా బయటపడవు. కానీ బయటపడిసరికి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. పైగా లివర్​కి ఏదైనా ఇబ్బంది వస్తే అది పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే లివర్​ ఫ్యాట్​తో ఇబ్బంది పడేవారు కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ ఇన్​ఫ్లమేషన్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా డీటాక్స్ చేసి ఫ్యాటీ లివర్​ సమస్యని కంట్రోల్ చేస్తాయి.

తృణ ధాన్యాలు
డైట్​లో రైస్​కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. గోధుమలతో చేసిన బ్రెడ్, క్వినోవాను డైట్​లో తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్​ని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా ఫ్యాట్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య కంట్రోల్​లో ఉంటుంది.

హెల్తీ ఫ్యాట్స్
శరీరానికి మంచికొవ్వులు అవసరం. కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ కోసం నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ వంటివి డైట్​లో తీసుకోవాలి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని కంట్రోల్ చేస్తాయి. మెటబాలీజంను పెంచుతాయి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేస్తాయి. బ్లడ్ షుగర్​తో పాటు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి. ఈ రెండూ లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

ప్రోటీన్ ఫుడ్
డైట్​లో చేపలు, చికెన్, బీన్స్, పప్పులు వంటివి చేర్చుకోవాలి. ఇవి ప్రోటీన్​ను శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా లివర్​లోని ఫ్యాట్​ని కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. అన్​ హెల్తీ ఫుడ్ తినాలన్న కోరికలను కంట్రోల్ చేస్తాయి.

వెల్లుల్లి
వెల్లిల్లి కూడా లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ఇది బరువును, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీలివర్​ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -