Friday, September 4, 2026
E-PAPER
Homeమానవిఒక్క టమాటాతో...

ఒక్క టమాటాతో…

- Advertisement -

బ్యూటీ పార్ల‌ర్‌లో ఉప‌యోగించే ప్రొడ‌క్ట్స్‌లో ఎంతో కొంత ర‌సాయ‌నాలు ఉంటాయి. ఇవి చ‌ర్మంపై ప్ర‌తికూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే నేచుర‌ల్‌గా ల‌భించే టమాటా‌తో చ‌ర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, సహజ ఆమ్లాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడ‌క్ట్స్ కంటే టమాటాలతో తయారు చేసిన ప్రత్యేక ఫేస్ ప్యాక్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ట‌మాటా‌ను ఎన్నో ఏళ్లుగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు: ఒక టమోటా, టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు, టీస్పూన్ నిమ్మరసం. త‌యారీ విధానం: ముందుగా తాజా టమోటాను బాగా కడిగి తొక్క తీయండి. ఇప్పుడు దాన్ని గుజ్జును వేరు చేసి మెత్త‌గా పేస్ట్‌లాగా చేసుకోండి. అనంత‌రం అందులో ఒక టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు కలపండి. తేనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది, పసుపు సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -