నవతెలంగాణ-కట్టంగూరు
అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని మండల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ స్పష్టం చేశారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన నిర్వహించిన గ్రామసభలో వారు పాల్గొని మాట్లాడారు. అక్రమ కలప రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవుల రక్షణలో ప్రజల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అటవీ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ అంజయ్య, ఆర్ఐ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, విద్యుత్ శాఖ లైన్ మెన్ రవికుమార్, ఆశా కార్యకర్తలు చెరుకు జానకి, సునీత, పద్మావతి, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, మంగమ్మ, లలిత, సైదమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ నిర్మల ఉన్నారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత: ఎఫ్ఓ శిరీష
- Advertisement -
- Advertisement -



