- Advertisement -
నవతెలంగాణ – చిన్నగూడూరు
మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో బుధవారం రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన నూతన ఫర్టిలైజర్ షాప్‌ను మాజీ మంత్రి రెడ్యానాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు అందించాలని షాప్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండీ అయూబ్ పాషా,ఎంపీటీసీ భర్తాపురం కొమురెల్లి,ముత్యం సత్యం,మరియు ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ పెద్దలు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



