నవతెలంగాణ-కుభీర్
మండలంలోని సిరిపెల్లి తండా 3కు చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ ఇటీవల కొన్ని రోజుల కిందట గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు శంకర్ చంద్రే,జిల్లా ప్రధాన కార్యదర్శి బంక బాబు మండల అధ్యక్షులు బషీర్,ఆత్మ చెర్మన్ సిద్ధం వివేకానంద,జిల్లా కార్యదర్శి పురం శెట్టి రవికుమార్, శివాజీ స్థానిక సర్పంచ్ క్రాంతి రాజ్, లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



