Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు

- Advertisement -

బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు 

మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు పరుపాటి వెంకటరెడ్డి వెన్నాకుల శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని అనంతరం రోగులకు ప్రభుత్వ దావకానలో పేదలకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేదలకు ఎంతగానో సహకరించి వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఎంతోమంది కుటుంబాలను ఆదుకొని వాళ్లకు ఉన్నంత స్థాయికిచ్చేరని అలాంటి గొప్ప వ్యక్తి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాసం వెంకటేశ్వర్ రెడ్డి, బోజ్య నాయక్, ఎర్రబెల్లి నవీన్ రావు, విరగని మల్లేశం గౌడ్, వారి పల్లి వెంకట్, రమణ, బత్తిని అనిల్ గౌడ్, పులి రామచంద్రు, బిక్కు నాయక్, రాము గౌడ్, ఎడ్ల మహేష్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -