Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లాస్టింగ్‌ దెబ్బకు కూలిన ఇండ్లు

బ్లాస్టింగ్‌ దెబ్బకు కూలిన ఇండ్లు

- Advertisement -

బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురంపల్లి ఓసిపి బ్లాక్-1బ్లాస్టింగ్ దెబ్బకు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు, ఇంటిగోడలు పగుళ్లు తేలడమే కాక కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాడిచెర్ల ఎస్సీ కాలనీకి చెందిన ఇందారపు బద్దయ్య ఇల్లు బుధవారం బ్లాస్టింగ్‌ దెబ్బల ప్రభావంతో పాక్షికంగా కూలి పోయింది. బ్లాస్టింగ్‌ దెబ్బలతో డేంజర్ జోన్లో ఇండ్లు, గోడలు పగిలిపోవడం, పైకప్పులు చీలిపోవడం, ఇండ్లలోకి దుమ్ము, దూళి చేరుతోందని నిర్వాసితులు బండి సుధాకర్, రాజ్ కుమార్, తాండ్ర సదయ్య వాపోతున్నారు. ఇండ్లు, ఇంటి గోడలు కూలిన నిర్వాసితులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాడితుల ఇళ్లు రోజురోజుకూ కూలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, మరింత ప్రమాదం జరగకముందే ప్రభుత్వం, జెన్కో ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -