ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

నవతెలంగాణ – ఢిల్లీ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై వివరణాత్మక చర్చ జరగాల్సి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి  సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఉచిత హామీల అమలుకు వెచ్చించే సొమ్మును మరింత ప్రయోజనకరంగా ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఉచిత హామీలు, వాటి అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడిన భారం.. తదితర వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఎన్నికలవేళ ఎడాపెడా ఉచిత హామీలు గుప్పించకుండా రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ పెట్టేందుకు ఓ వ్యవస్థ అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ వివరించారు. ఈ విషయంలో సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లాంటి పేద దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వమే కొన్ని కనీస సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

Spread the love