బీజేపీది బెయిల్ అండ్ జైల్ గేమ్ : మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అవినీతి పరులకు డెన్ గా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ అవినీతి పాఠశాల నడుపుతోందని.. అవినీతి శాస్త్రం సబ్జెక్ట్ లో డొనేషన్ బిజినెస్ తో సహా బోధన చేపట్టిందని సెటైర్ వేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన ఆయన.. దాడుల ద్వారా విరాళాల సేకరణ ఎలా జరుగుతాయి?, విరాళాల తర్వాత ఒప్పందాలు ఎలా జరుగుతాయి? అవినీతిపరులను కడిగే వాషింగ్ మెషిన ఎలా పని చేస్తుంది? బెయిల్ అండ్ జైల్ గేమ్ ఎలా ఆడుతున్నారు? అనే అంశాలపైతమ నేతలకు ఈ క్రాష్ కోర్సును తప్పనిసరి చేసిందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న నిర్వాకానికి దేశం ముూల్యం చెల్లిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ అవినీతి పాఠశాలకు తాళం వేసి, ఈకోర్సులను శాశ్వతంగా మూసివేస్తామని తెలిపారు.

Spread the love