- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెరుమాండ్ల రాములు గురువారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నంగునూరి రవీందర్ గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంగునూరి రవీందర్ గుప్త మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
- Advertisement -



