నవతెలంగాణ – పరకాల
హనుమకొండ జిల్లాలోని పరకాల సబ్‌డివిజన్ పరిధిలో గురువారం (జూలై 30) పలుచోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పరకాల మండలంలో అత్యధికంగా 40.1 మి.మీ. వర్షపాతం కురవగా, సాధారణ వర్షపాతం 9.3 మి.మీ. మాత్రమే ఉండటంతో 331 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నడికూడ మండలంలో 31.0 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం 10.4 మి.మీ.తో పోలిస్తే 198 శాతం అధికంగా కురిసింది. శాయంపేట మండలంలో 23.9 మి.మీ., సాధారణం 11.6 మి.మీ.తో పోలిస్తే 106 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సంగం మండలంలో 14.4 మి.మీ., సాధారణం 8.2 మి.మీ.తో పోలిస్తే 75 శాతం అధికంగా వర్షం కురిసింది. గీసుకొండ మండలంలో 13.2 మి.మీ., సాధారణం 8.8 మి.మీ.తో పోలిస్తే 50 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు మండలంలో 17.9 మి.మీ. వర్షపాతం కురవగా, సాధారణం 10.6 మి.మీ.తో పోలిస్తే 68 శాతం అధికం నమోదైంది. దామెర మండలంలో 15.9 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, సాధారణం 10.7 మి.మీ.తో పోలిస్తే 48 శాతం అధికంగా ఉంది.
అయితే సీజన్ ప్రారంభం నుంచి జూలై 30 వరకు నమోదైన మొత్తం వర్షపాతాన్ని పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పరకాల మండలంలో 299.9 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం 473.4 మి.మీ.తో పోలిస్తే 37 శాతం లోటు ఉంది. నడికూడలో 278.9 మి.మీ. నమోదై 39 శాతం లోటు, శాయంపేటలో 224.9 మి.మీ. నమోదై 55 శాతం లోటు, దామెరలో 234.4 మి.మీ. నమోదై 48 శాతం లోటు, సంగం మండలంలో 179.5 మి.మీ. మాత్రమే నమోదై సాధారణం 321.5 మి.మీ.తో పోలిస్తే 44 శాతం లోటు ఉంది. గీసుకొండ మండలంలో 126.5 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం 378.8 మి.మీ.తో పోలిస్తే 67 శాతం లోటు ఉండటంతో తీవ్ర వర్షాభావ (Large Deficient) మండలంగా కొనసాగుతోంది. ఆత్మకూరు మండలంలో 156.3 మి.మీ. మాత్రమే నమోదవగా, సాధారణం 458.8 మి.మీ.తో పోలిస్తే 66 శాతం లోటు నమోదై తీవ్ర వర్షాభావ మండలంగా ఉంది.
గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రైతుల్లో కొంత ఊరట కనిపించినప్పటికీ, సీజన్ ప్రారంభం నుంచి నమోదైన వర్షపాతం లోటు కారణంగా పరకాల సబ్‌డివిజన్ పరిధిలోని పరకాల, నడికూడ, శాయంపేట, దామెర, సంగం, గీసుకొండ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, ఆత్మకూరు, గీసుకొండ మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రైతులు వర్షాలకొనసాగింపుపై ఆశగా చూస్తున్నారు.



