నవతెలంగాణ – అశ్వారావుపేట
కోడి ఇంట్లోకి వచ్చి అ శుభ్రం చేస్తుందని అనే సంఘటనలో ఇరుగు పొరుగు కుటుంబీకులు గొడవపడి ఒకరి పై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో మాజీ సర్పంచ్ ఒకరు రిమాండ్ అయ్యారు. అశ్వారావుపేట అదనపు ఎస్.ఐ శివరాం తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని గుమ్మడి వల్లి కి చెందిన వంటి పల్లి శివరాం క్రిష్ణ తన పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొడిమి సీత ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారు అని ఏప్రియల్ ఒకటో తేదీ న పిర్యాదు చేసాడు.విచారణ అనంతరం బత్తుల కొండ, కొడిమి సీత,కొడిమి వినోద్ లను మంగళవారం కొత్తగూడెం కోర్టు లో ప్రవేశ పెట్టగా ఈ ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్.ఐ శివరాం తెలిపారు.