చిన్నారులను ఆశీర్వదించిన మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, ఎమ్మెల్యే జయవిర్

– ఘనంగా అంగన్వాడీ టీచర్ కుమారులు, కూతురు పుట్టుపంచె, వొల్లే
నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలం కుంకుడు చెట్టు పంచాయతీ పరిధిలోని బోనూతల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బాణాల వరలక్ష్మి, తిరుమల రెడ్డి దంపతుల కుమారుడు, కుమార్తె తేజబ్ రెడ్డి, లీలా వర్షిణి ల పుట్టుపంచెలు, పుట్టు వొళ్లె వేడుక ఘనంగా జరిగింది. సోమవారం తిరుమల గిరి సాగర్ మండలం అలవాల ఎక్స్ రోడ్డు వద్ద శుభమ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గగ్గేనపల్లి హన్మంత్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ పాకాల యల్లయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు పగడాల నాగరాజు, ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు దండు బిక్షం, పగడాల తిరుమల్,కాంగ్రెస్ సినియర్ నాయకులు గగ్గేన పల్లి సంభారెడ్డి, బాణాల కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love