డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురుకి జైలు శిక్ష…

– పోలీస్ కమిషనర్ వెల్లడి
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీ టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ బుధవారం కాస్ట్లీ నిర్వహించారు.  అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం గారి ముందర హాజరుపరచగా 9 మందికి 13500 /- రూపాయలు జరిమాన విధించి నలుగురికి జైలు శిక్ష పడిందని తెలిపారు. జైలు శిక్ష పడిన వారిలో బాసరకు చెందిన దుర్గయ్య, గాయత్రి నగర్కు చెందిన రాజేశ్వర్, ఆర్య నగర్ కు చెందిన వెంకటేష్, త్రిపురాంతకం కు చెందిన చంటి లకు రెండు రోజుల జరిగే శిక్ష పడిందని తెలియజేశారు.
Spread the love