Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాలుగో విడత రైతు భరోసా నిధులు విడుదల

నాలుగో విడత రైతు భరోసా నిధులు విడుదల

- Advertisement -

నాలుగు నుంచి ఐదెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ
ఇప్పటివరకు 65.76 లక్షల మంది రైతులకు రూ.6590.37 కోట్ల రైతుభరోసా సాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతుభరోసా పథకం కింద నాలుగో విడతలో నాలుగు నుంచి ఐదెకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను శుక్రవారం రాష్ట్ర సర్కారు జమ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తంగా ఈ సీజన్‌‌లో రైతుభరోసా పథకం కింద 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -