నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏపీలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు వచ్చేనెల రెండో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న తమ అకాడమిలో ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు అమిగోస్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి ప్రకటించింది. గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్, సన్నద్ధత, ప్రణాళిక, నోట్స్ మేకింగ్, సమయపాలన వంటి అంశాలపై సీనియర్ అధ్యాపకులతో సమగ్ర అవగాహన కల్పిస్తామని ఆ అకాడమి నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ రాష్ట్రస్థాయి మాక్ పరీక్షను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.