విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ ఉచితంగా పంపిణీ  

నవతెలంగాణ – డిండి
పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి పున్న దినేష్ ఆద్వర్యంలో కందుకూరు, టి. గౌరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పూర్తి మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీ గౌరరం మాజీ సర్పంచ్ దొంతినేని నాగేశ్వర రావు, లట్టుపల్లి శేఖర్ రెడ్డి, కోటేష్, యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులు జంగ గిరీష్ యాదవ్ , వెంకటయ్య ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love