రక్తహీనత లోపించిన విద్యార్థులకు ఉచితంగా మందుల పంపిణీ

నవతెలంగాణ – వేములవాడ
ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు అధికంగా రక్తహీనతతో బాధపడుతున్నారని, దానిని నివారించడమే ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యమని మంగళవారం డాక్టర్ లహరిక అన్నారు.  వేములవాడ పట్టణంలోనిప్రభుత్వ కళాశాలలో రాష్ట్రీయ బాల స్వస్త ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లహరిక విద్యార్థులకు ఎనిమియా పరీక్షలు నిర్వహించి రక్తహీనత లోపించిన విద్యార్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో రక్తహీనత రాకుండా ఉండడానికి ఆకుకూరలు బీట్రూట్ వంటి వాటిని భోజనంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ నార్మల్ రేంజ్ అమ్మాయిల్లో 12 నుండి 14 గ్రామ్స్ వరకు అబ్బాయిల్లో 14 నుండి 16 గ్రామ్స్ వరకు ఉంటుందని, హిమోగ్లోబిన్ శాతం తగ్గితే విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ పావని, ఫార్మసిస్ట్ గౌస్, ఏఎన్ఎం సౌజన్య, కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ ఉన్నారు.
Spread the love