– ఇరాన్ అణు కార్యక్రమంపై తెలివిగా వ్యవహరించాలి : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి తీవ్రంగా బెదిరించారు. నిలిచిపోయిన అణు కార్యక్రమం చర్చలపై ఇరాన్ త్వరగా తేల్చాలని, తెలివిగా వ్యవహరించాలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో తుపాకితో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. దీంతో ఇది నెట్టింట వైరల్ అయింది. అయితే యుద్ధం ముగిసిన తరువాతే అణు కార్యక్రమంపై చర్చలని ఇరాన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ తన పోస్ట్‌లో, ఇరాన్ తమ పనిని సరిగ్గా చేయలేకపోతోంది. వారికి అణురహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో తెలియదు. వారు త్వరగా తెలివిగా వ్యవహరించాలి! అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు, ట్రంప్ తన ఎఐ రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు, అందులో ఆయన అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకొని ఉండగా, వెనుక పర్వత ప్రాంతంలో బాంబులు పేలుతున్నాయి. ఆ చిత్రంపై ‘నో మోర్ మిస్టర్ నైస్ గై- (ఇకపై మంచివాడిగా ఉండను!) అని బ్యానర్ ఉంది.అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ బెదిరింపులు చేయడం గమనార్హం.
ఇక నుంచి మంచోడిగా ఉండను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



